అనారోగ్యంతో ఏఐసీసీ మాజీ ప్రధానకార్యదర్శి మృతి

కరీంనగర్‌: ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కె. వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి కరీంనగర్‌లోని ఓప్రైవేటు ఆసుపత్రిల చికిత్సపొందుతూ కన్నుమూశారు. గతంలో మలేషియాలో భారత రాయబారిగా కూడా పని చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లతో కె.వి. రెడ్డి సన్నిహితంగా ఉండే వారు.