మంథని నియోజకవర్గంలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌

మంథని: మంథని నియోజకవర్గంలోని 112 పంచాయతీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎన్నికల కోసం 3,211 మంది సిబ్బందిని నియమించారు. 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.