చీరల పంపిణీపై ఎన్నికల విచారణ చేపట్టిన అధికారులు
జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం సర్పంచి అభ్యర్థి కె. మధుసూదన్ ఓటర్లను చీరలు పంపిణీ చేస్తుండగా ప్రత్యర్థి అలీమహ్మద్ పట్టుకున్నారు. సమాచారం అందిన మండల ఎన్నికల పర్యవేక్షణాధికారులు విచారణ చేపట్టారు. 14 చీరలు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఇరు వర్గాలను విచారిస్తున్నట్లు జిల్లా ఎన్నికల సహాయ అధికారి భావనారుషి తెలిపారు.