ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఉంగుటూరు(పశ్చిమగోదావరి): ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఏలేటి రమేష్ (35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న రమేష్‌ను జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఉంగుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.