ఎఫ్‌డిఐల పెంపు – పొంచివున్న ప్రమాదం
టెలికాం భీమా అరువు ఖాతాలు, సమాచార స్థిరాస్థుల పునర్ని ర్మాణ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) మరింత ఆహ్వానించడం అడ్డగోలుగా పెంచడం, అత్యంత ప్రమాదకరం. మల్టీ బ్రాండ్ రిటైల్ వాణిజ్యాన్ని బార్లా తెరిచింది. యుపిఏ ప్రభు త్వం రక్షణ రంగం కీలకమయయిన టెలికాం రంగాన్ని కూడా విదే శీ పెట్టుబడి దారులకు దేశ సంపదనంతా అప్పగించడం 2జీ స్పెక్ట్ర మ్‌లో జరిగిన భారీ కుంభకోణం మరవకు ముందే కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద టెలికాం రంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ఆర్థికపరంగా దేశ భద్రతకు ప్రమాదం పొంచి వుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తునానయి. గత పార్లమెంట్‌లో రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐలపై జరిగిన ఓటింగ్‌లో యుపిఏ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచినా నైతికంగా ఓడిపోయిం ది. ప్రజల్లో తీవ్రమయినా వ్యతిరేఖత నెలకొంది. యుపిఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను నయా ఉదారవాద ఆర్థిక విధానాలపై పునరాలోచించ బదులు విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతున్నారు. తరుచు ధరలు పెంపుదల వల్ల చమురు కంపెనీలకు లాభాలు గడిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని వేగవంతం చేస్తుంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో రూపాయి పతనం కావడానికి భారత ఆర్ధిక వ్యవస్థను అమెరికా ఆర్థిక వ్యవస్థతో పూర్తిగా సంలీనం చేయడం ఫలితమేమిటని అంగీకరించాలి డాలర్‌తో రూపాయి మారకం విలువ పదిహేను శాతం పడిపోయిన దాని ప్రభావంతో ప్రతీ వస్తువులపై ధరలు పెంచేలా చేస్తుంది. పెట్రోలియం గ్యాస్ డీజిల్ ఉత్పత్తుల ధరలకు అదుపు లేకుండా పోయింది. పారిశ్రామికీకరణ కుంటుపడింది. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. దిగజారిపోతు న్న ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్‌డిఐ మన దేశంలోకి ఆయా రంగాలలో వేగవంతంగా అనుమతిస్తున్నారు. ఆర్ధిక సంస్కరణల వల్ల భారత్‌లో అన్ని వర్గాల ప్రజల బతుకులు రోజు రోజుకు మరింతగ దిగజారిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశ ప్రజలకు శాపంగా మారాయి. మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని కావడం దరదృష్టకరం ఎందుకంటే మన్మోహన్ ప్రపంచ బ్యాంక్ జీతగాడుగా, సామ్రాజ్యవాద ఏజెంట్‌గా భారత ప్రజల వ్యతిరేఖిగా ముద్రవేసుకున్నాడు. ఆర్థిక సంస్కరణలు ప్రజలకు ఉరితాళ్ళు బిగించుకున్నాయి. హడావుడిగా ఒకేసారి 12 రంగాలలో రెండవ తరం సంస్కరణ పేరిట ప్రత్యక్ష విదేవీపెట్టుబడు లు తలుపులు తెరిచారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏకపక్ష నిర్ణయా లు తీసుకుంటుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా సామ్రాజ్య విదేశీ స్వదేశీ కార్పొరేటు దారులకు ఊడిగం చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష విదేవీ పెట్టుబడులపై దేశ వ్యాప్తంగా తీవ్రంగా ప్రతిఘటిస్తు న్నారు. లాభార్జనే ధ్యేయంగా బావించే విదేశీ బహుళజాతి కార్పొ రేట్ సంస్థల దోపిడికి భారతదేశాన్ని ఒక ఆకర్షణీయ మార్కెట్‌గా మార్చడానికి మన్మోహన్‌సింగ్ ఆరాటపడుతున్నాడు. 74 శాతం ఉన్న ఎఫ్‌డిఐల పరిమితిని ఇప్పుడు నూటికి నూరువాతం అనుమ తించారు. రానున్న కాలంలో టెలికమ్యూనికేషన్స్ పూర్తిగా విదేశీ పెట్టుబడిదారుల చేతిలోకి పోయినా ఆశ్యర్యపడనవసరం లేదు. రికన్‌స్ట్రక్షన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్‌లను దిగజార్చారు. ఇన్సురెన్స్ రంగం లో 26శాతం నుంచి 49 శాతానికి పెంచారు. మన దేశాన్ని అంగడి సరుకుగా చూస్తున్నారు. లాభాలను ఆర్జించి విదేశీ బహుళ జాతి సంస్ధలకు దోచిపెట్టాలని మన్మోహన్‌సింగ్ తహ తహలాడుతు న్నాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతర్జాతీయ వేదిలకపై ఆర్థి సంస్కరణల అమలులో భారత్ వేగం తగ్గిపోవడం ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో రెండోతరం సంస్కరణలు మరింత వేగం పుంజుకున్నాయి. భారత స్వతంత్ర భారతావనిలో లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయి. ఆహార భద్రత బిల్లు ద్వారా మళ్లీ ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆహార భద్రత బిల్లును తెరపైకి తెచ్చింది. ఆర్డినెన్స్ విధానాల ద్వారా ఆహార భద్రత బిల్లు 12 రంగాలలో ఎఫ్‌డిఐలను అనుమతించడం ప్రజాస్వామ్య వ్యవస్థకి సిగ్గుచేటు. మన ప్రజాస్వామ్య విలువలను అమెరికా సామ్రాజ్యవాదులకు తాకట్టుపెడుతున్నారు. విదేశీ నిధుల ప్రవాహా నికి అడ్డుపడినపుడు అప్పుడు లావాదేవిలు తలకు మించిన భారాల వుతున్నాయి. విదేవీ పెట్టుబడులకు రెడ్‌కార్పెట్ పరచడం వల్ల స్వదేశీ సంస్థల పోటీని తట్టుకోలేక గిల గిల కొట్టుకుంటున్నారు. దేశంలో పరిశ్రమలు నెలకొలిపేందుకు స్వదేశీయ పెట్టుబడి దారుల కు కనీస పెట్టుబడులు కల్పించడం లేదు. భారతదేశ ఆర్థిక వ్యవ స్థను ప్రభుత్వం విదేశీ పెట్టుబడులక తాకట్టు పెడుతున్నారు. భారత ప్రజల తరుపున గాకుండా అమెరికా బహుళజాతి సంస్థలకు పెద్ద పీట వేయడానికి మన్మోహన్ సింగ్ బరితెగించాడు. కెట్లాది మంది చిరు వ్యాపారులు తమ ఉపాధిని కోల్పోయి వీధులపాలయినారు. మీడియా కార్పొరేట్‌ల చేతులో కీలుబొమ్మగా మారింది. భవిష్య త్తులో అంతర్జాతీయ గుత్త సంస్థలవాణి తప్ప ప్రజల గొంతు వినప డదు. ఆర్ధిక ప్రజాస్వామ్యానికి రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రమా దం ముంచుకొచ్చింది. భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు రావడం అత్యంత ప్రమాదకరం సోనియా మన్మోహన్‌లు విదేశీ సామ్రాజ్య వాధులకు వంతపాడుతు ప్రజాస్వామ్యాన్ని భారత దేశ గౌరవ విలువలన్నీ తాకట్టుపెట్టడంతో ప్రజల బతుకులు దర్భరంగా మారాయి. విదేశీ పెట్టుబడులను వ్యతిరేఖిద్దాం! భారతమ్మను కాపాడుకుందా!!
-దామెరపల్లి నర్సింహారెడ్డి