ప్రాణత్యాగాలకైనా సిద్దమే: కోమటిరెడ్డి
నల్గొండ: తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్, బొత్స సత్య నారాయణ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడ్డారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నాయకులను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోతే ప్రాణత్యాగాలకైనా సిద్దమేనన్నారు.