కొద్దిగా కోలుకున్న రూపాయి
ముంబై,(జనంసాక్షి): రూపాయి కొద్దిగా కోలుకుంది. రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలే ఫలించాయో, మరే కరాణమో గానీ.. 41 పైసలు పైసలు పెరిగి మళ్లీ 58 రూపాయల స్థాయికి వచ్చింది. ఒక అమెరికా డాలర్‌కు 58.70 రూపాయలుగా మారకపు విలువ ఫారెక్స్ మార్కెట్‌లో ట్రేడయింది.
పలు బ్యాంకులతో పాటు ఎగుమతిదారులు కేడా తమ వద్ద ఉన్న అమెరికా డాలర్లను అమ్మెయసాగారు. రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యల కారణంగా రూపాయి బలపడటం, యెన్, ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీన పడటం కూడా ఇందుకు కారణాలేనని భావిస్తున్నారు.