నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్
హరారే: భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. 17.3 ఓవర్లకు భారత్ 66 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్‌శర్మ (1), విరాట్ కోహ్లి (14), సురేశ్‌రైనా(4), తిరుపతిరాయుడు (5) పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. ధావన్ (25) దినేష్ కార్తీక్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. జింబాబ్వే బౌలర్స్ విటోరి 2, జార్విన్ 1, ఛటారా 1 వికెట్లు తీసుకున్నారు.