ఆందోళన చేపట్టిన తెదేపా కార్యకర్తలు

విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో స్థానికేతరులు ఓటు హక్కు వినియోగంపై వివాదం ఏర్పడింది. స్థానికేతరులు 250 మంది ఓటు వేసేందుకు రావడంతో గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. పోలింగ్‌ కేంద్రం బయట గ్రామస్థులు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అధికారులు మాత్రం జాబితాలో పేర్లు ఉన్నవారి కి గుర్తింపు కార్డులు ఉంటే ఓటు వేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం తెదేపా కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు.