అధికారి నుంచి నగదును అపహరించిన దుండగులు ఆగిపోయిన ఓట్ల లెక్కింపు

తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట పంచాయతీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జోన్‌-1 అధికారి నుంచి రూ. 1.35 లక్షల నగదును దుండగులు లాక్కెళ్లారు. దీంతో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద లెక్కింపు ఆగిపోయింది. నగదును ఓటర్లను పంపిణీ చేసేందుకు తెచ్చారంటూ కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జి చేశారు.