రెండో విడతలోనూ జోరందుకున్న కారు
హైదరాబాద్,(జనంసాక్షి): పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ కారు జోరందుకుంది. ప్రత్యర్థులను దాటి దూసుకుపోతుంది. రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఎక్కువ మంది గెలుపొందుతున్నారు. గెలుపొందిన టీఆర్‌ఎస్ మద్దతుదారుల వివరాలు జిల్లాలవారిగా ఆదిలాబాద్-61, మహబూబ్‌నగర్ -37, రంగారెడ్డి-22, కరీంనగర్-107, మెదక్-17, రంగల్-88, నిజామాబాద్ -67, నల్లగొండ-115 స్థానాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఎన్నికల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది.