మంగోలు గ్రామంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కొండపాక: మెదక్‌ జిల్లా కొండపాక మండలంలోని మంగోలు గ్రామంలో ఈతకు వెళ్లి నవీన్‌ (12) అనే విద్యార్థి మృతి చెందాడు. శనివారం సాయంత్రం ఐదుగురు స్నేహితులు కలిసి గ్రామశివారులోని ఒక కుంటలోకి ఈతకు వెళ్లారు. నవీన్‌ నీటిలో మునిగిపోవడంతో స్నేహితులు భయంతో ఇళ్లకు చేరుకున్నారు. అయితే తల్లిందడ్రులకు ఈ విషయం తెలియకపోవడంతో నవీన్‌ కోసం రాత్రి వరకూ గాలించారు. చివరికి కుంటలో నవీన్‌ మృతదేహాన్ని గుర్తించి స్థానికులు వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.