ద్విచక్రవాహనం, ఆటో ఢీ:ఆరుగురికి గాయాలు

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని ఈద్గాం కూడలిలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. వీరిని కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు.