భారత్, పాక్‌ల దౌత్యం
సముద్ర, సరిహద్దు జలాలపై చర్చలు
పాక్ స్నేహ హస్తాన్ని ఆహ్వానించిన భారత్
న్యూఢిల్లీ, జూలై 28 (జనంసాక్షి) :
పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భారత్ ఆ దేశంతో దౌత్య సంబంధాలు మెరుగు పరుచుకోవాలని ప్రయత్నిస్తోంది. సరిహద్దు, సముద్ర జలాలపై విస్తృత స్థాయి చర్చల ద్వారా సమస్యలు పరిష్క రించుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. నవాజ్‌షరీఫ్ ప్రధాని అయిన మరుసటి రోజే పాకిస్తాన్ సైన్యం భారత బలగాలపై ఊచకోతకు పాల్ప డ్డాయి. ఇద్దరు సైనికుల తలలు తెగ్గోసి తన పాశవిక చర్యను ప్రపంచానికి చాటాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలుమార్లు అతిక్రమించి భారత సరిహద్దు బలగాలపై కాల్పులు జరిపాయి. ఈ మేరకు ఆదివారం ఇద్దరు బీఎస్‌ఎఫ్ సీనియర్ జవాన్లు సరిహద్దులో పరిస్థితిని సమీక్షించారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డే పాకిస్థాన్ రేంజర్స్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలుపుతామన్నారు. తాము పాకిస్తాన్‌తో స్నేహహస్తాన్ని కోరుకుం టున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.