భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి
కరీంనగర్,(జనంసాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామగుండం డివిజన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి అధకంగా నీరు వచ్చి నిలవడంతో యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.