విద్యుదాఘాతానికి గురై రైతు మృతి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని రేగొండ గ్రామంలో పిట్టల రాజయ్య (65) అనే రైతు విద్యుదాఘాతానికి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కరెంటు మోటారు ఆన్ చేయగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమారైలు ఉన్నారు.