అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్న రీజనల్ డైరెక్టర్
ఇల్లందు: వరంగల్ రీజనల్ డైరెక్టర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ఎస్. రామనారాయణ రెడ్డి శుక్రవారం ఇల్లందు పట్టణంలో పర్యటించారు. పారిశుధ్ధ్య లోపం అధికంగా ఉన్నందున అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని కిమిషనర్‌ని ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అంజన్‌కుమార్ పాల్గొన్నారు.