రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

కమలాపూర్‌: మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కమలాపూర్‌ మండలం ఏసురాజుపల్లి గ్రామానికి చెందిన బాబు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కమలాపూర్‌ నుంచి వంగపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలుకాగా వారిని చికిత్స కోసం వరంగల్‌కి తరలించారు.