పురుగుల మందు తాగి ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలం పిట్లవాని పాలెం గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఏపూరి శ్రీనివాసరావు (42) బాపట్ల రైల్వే స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీఎస్పీ నల్గొండ బెటాలియన్‌కు చెందిన శ్రీనివాసరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం సెలపై ఇంటికి వచ్చి, శనివారం రాత్రి హైదరాబాద్‌ వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో బాపట్ల రైల్వే స్టేషన్‌లో పురుగుల మందు తాగాడు. రైల్వే పోలీసులు గమనించి శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.