రైలు కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు
జమ్మికుంట గ్రామీణం: నడుస్తున్న రైలు నుంచి కిందపడి ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జమ్మికుంట గ్రామం మడిపల్లి గ్రామసమీపంలో ఈ ఘటన జరిగింది. గోదావరి ఖనికి చెందిన మూల నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబీకులు అతడ్ని వరంగల్ ఆసుపత్రికి తరలించారు.