చెట్టును ఢీ: ఆటో ఇద్దరి మృతి
అనంతపురం:జిల్లాలోని కదిరి మండలం మోతుకుపల్లి వద్ద ఈ ఉదయం ఓ ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.