ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు

హైదరాబాద్‌: విద్యుత్తు సంస్థల్లోగల ఖాళీ పోస్టులను కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ ముందు పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. కరవు భత్యాన్ని సంస్థ అధికారులు వేతనంతో కలిపి చెల్లించాలని, శాశ్వత ఉద్యోగులకు డీఏ చెల్లిస్తున్నట్లే కాంట్రాక్టు ఉద్యోగులకు వీడీఏ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం దిగిరాకపోతే నమ్మెకు దిగుతామని సంఘం నాయకులు హెచ్చరించారు.