తెలంగాణ పై వెనుకంజ వేస్తే మెరుపుసమ్మె : కన్వీనర్ రాజిరెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణపై వెనుకంజ వేస్తే మెరుపుసమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ విభాగం కన్వీనర్ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి తెలంగాణలోని అన్ని డిపోల ఎదుట నిరసనలు చేపడతామని,ఈ నెల 17న చలో కలెక్టరేట్, 27న చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు.