మోడీని కలిసేందుకు బారులు తీరిన ఉత్తరాదివాసులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు ఉదయం నగరానికి చేరుకున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు నగరంలో స్థిరపడిన ఉత్తరాదివాసులు ఆయన బస చేస్తున్న పార్క్‌ హయత్‌ హోటల్‌ వద్ద బారులు తీరారు. పరిమిత సంఖ్యలోనే మోడీని  కలిసేందుకు పోలీసులు అనుమతిస్తుండటంతో భాజపా కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.