సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గితే మెరుపు సమ్మె


హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) :
సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై వెనకడుగు వేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో  ఆయన పాల్గొని మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎన్ని ఆందోళనలు చేసినా ఎస్మాలు, జీవోలు ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదని ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఉద్యోగులు ఎందుకు సమ్మెకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కేంద్రం ఏ మాత్రం వెనకడుగు వేసినా తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.