భార్యను హతమార్చిన భర్త
జమ్మికుంట గ్రామీణం: మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన డుగ్యాల రజిత (20) మృతదేహాన్ని కోరపల్లి సత్తుకుంట కాలువ వద్ద సోమవారం గ్రామస్థులు కనుగొన్నారు. రజితను భర్త కుమార్ హతమార్చి కుంట వద్ద పడేశాడని మృతురాలి తల్లితండ్రులు రాజమ్మ, ఓదెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహన్ని జమ్మికుంట గ్రామీణ సీఐ వీరబద్రం, తహశీల్దార్ ప్రమోద్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలి కుటుంబీకుల నుంచి వివరాలను సేకరించినట్లు సీఐ తెలిపారు.