నూతన సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డీఎస్పీ

సుల్తానాబాద్‌: నూతనంగా ఎన్నికయిన సర్పంచి, ఉపసర్పంచులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఎటువంటి పంచాయతీలు జరిగినా పోలీసుశాఖకు తెలియజేయాలని కోరారు. నూతన గ్రామ సర్పంచులకు అభినందలు తెలిపారు. మేజర్‌ గ్రామపంచాయతీ సుల్తానాబాద్‌ గ్రామసర్పంచి అంతటి అన్నయ్య గౌడ్‌ డీఎస్పీ, ఎస్సైలను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అజయ్‌, పలుగ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.