సమ్మెతో సమస్యలు ఇంకా జఠిలమవుతాయి: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి:) సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టనున్న సమ్మెపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జీ, కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. వాళ్లు సమ్మె చేయడం ద్వారా సాధించేదేమీలేదని ఆయన తెలిపారు. ఆందోళనలతో సమస్యలు ఇంకా జఠిలమైతాయి తప్ప పరిష్కారం కావని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులందరు విధులకు హాజరై సామన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. సీమాంధ్ర ఉద్యోగులు వాళ్ల సమస్యలను ఆంటోని కమిటీకి నివేదించి పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన విషయంలో నిన్న హైదరాబాద్‌లో జరిగిన సభలో అరవై అబద్దాలాడారని దుయ్యబట్టారు.