అధిష్ఠాన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న సీఎం కిరణ్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటును సీఎం కిరణ్‌, వైఎస్‌ జగన్‌ అడుగడుగునా అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ విమర్శించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి కిరణ్‌ ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చేది, మేమే, తెచ్చేది మేమే అని చెప్పుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ రాకముందే సంబరాలు జరుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏంకానేలేదు అప్పుడే సంబురాలు జరుపుకోవడం తగదని ఆయన సూచించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందగానే అందరం కలిసి అంబరాన్నంటే సంబురాలు జరుపుకుందామని అన్నారు.