సీఎం కిరణ్ తీరుపై ధ్వజమెత్తిన టీఆర్‌ఎస్
హైదరాబాద్,(జనంసాక్షి): కేసీఆర్‌కు భద్రత విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భద్రత విషయంలో కిరణ్ సర్కార్ స్పందించకపోతే కుట్రులు చేస్తున్న వారికి సర్కార్ సహకరిస్తున్నట్లుగా భావించాల్సి వస్తది అని ఆయన పేర్కొన్నారు. సీమాంద్రలో సొంత నాయకుల విగ్రహాలకే రక్షణ కల్పించలేని సీఎం కిరణ్ కేసీఆర్ భద్రతకు చర్యలు తీసుకుంటారని అనుకోవడం లేదు అని చెప్పారు.