అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఈసీ లేఖలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం లేఖలు రాసింది. ఈ ఏడాది జూలై 10 తర్వాతే వేర్వేరు కోర్టుల్లో శిక్షలు పడిన ప్రజాప్రతినిధుల జాబితా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శిక్ష పడిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.