చెట్టును ఢీకొన్న పెళ్లి బృందం కారు.. ఇద్దరి మృతి

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారు గుంటుపల్లి గ్రామం వద్ద ఈ ఉదయం పెళ్లి బృందంతో తిరిగివస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు బాబాయి, పిన్ని మృతి చెందగా.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. చల్లపల్లి ఏఎస్‌ఐ నాగేంద్ర కూతురు శ్రీదేవి పెళ్లి ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. మంగళవారం ఉదయం బంధువులతో కలిసి చల్లపల్లి తిరిగివస్తుండగా గుంటుపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు దుర్గాప్రసాద్‌ బాబాయి. పిన్ని మృతి చెందారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు శ్రీదేవి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరింస్తున్నారు.