సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వమే నడిపిస్తుంది: నరేందర్‌రావు
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల మంచితనాన్ని చేతగానితనంగా ఏపీ ఎన్టీవోలు భావించొద్దు అని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత నరేందర్‌రావు పేర్కొన్నారు. మంచి వాతావరణంలో పని చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు అని ఏపీ ఎన్టీవోలు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులది సమైక్యాంధ్ర ఉద్యమమైతే 13జిల్లాలకే ఎందుకు పరిమితమైతదని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వమే నడిపిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను సీఎస్ ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. సమస్యలపై చర్చించేందుకు సీమాంధ్ర ఉద్యోగులను పిలిస్తే స్పందన లేదన్నారు. లెక్కలతో వస్తే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. ఇప్పటికైనా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెను విరమించుకోవాలని కోరారు. లేకపోతే ఈ నెల 19న తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.