సీఎం,డీజీపీ లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు :వివేక్
కరీంనగర్,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్ నేత జి.వివేక్ డిమాండ్ చేశారు. వీళ్లిద్దరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా ధర్నాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసిన డీజీపీ అందుకు విరుద్దంగా సీమాంధ్ర ఉద్యమంపై వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విధ్వంసం సృష్టిస్తున్న ఉద్యమకారులపై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని తేలిపోయిందని వివేక్ పేర్కొన్నారు.