మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తాం: దానం నాగేందర్
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ మంత్రులం అంటోని కమిటీకి ప్రత్యేక నివేదిక ఇస్తామని మంత్రి దానం నాగేందర్ అన్నారు. బొత్సతో సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ మంత్రులం రాష్ట్ర విభజనపై ఏర్పాటైన ఆంటోని కమిటీకి ప్రత్యేక నివేదికను అందజేస్తామన్నారు. అయితే నివేదికలోని అంశాలను బయటకు వెళ్లడించలేమని స్పష్టం చేశారు. తెలంగాణపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఈ నెల 19న ఆంటోని కమిటీని కలిసేందుకు తమకు సమయం కేటాయించాలని తాము బొత్సను కోరామని వెల్లడించారు.