ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మళ్లీ వాయిదా పడే అవకాశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 19 నుంచి జరగాల్సిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడే అవకాశం ఉంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విధులకు హాజరు కాకూడదని సీమాంధ్ర పాలిటెక్నిక్‌ అధ్యాపకుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ సీమాంధ్ర పాలిటెక్నిక్‌ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌ వాయిదా పడితే తాము  అకడమిక్‌ ఇయర్‌ కోల్పోతామని విద్యార్థులు వాపోతున్నారు.