సింగరేణిలో కొనసాగుతున్న ఆందోళనలు
వరంగల్,(జనంసాక్షి): పార్లమెంట్ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి వరంగల్ జిల్లా సింగరేణి గనులపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. కేటీకే-1,2,5,6 ఉపరితలఅ గని, లాంగ్‌పాల్ ప్రాజెక్టులపై సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి గని ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాసులు, నాయకులు సంతోష్, చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.