నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ వివిధ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలను నియమించారు. ఆసిఫాబాద్‌ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా లక్ష్మి, అలంపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా మంద శ్రీనాథ్‌, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జీగా విఠల్‌రావు ఆర్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సెక్రటరీగా చల్ల మాధవరెడ్డిని నియమించారు.