సీఎంతో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రుల సమావేశం ముగిసింది. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తుంది.