తెలంగాణ ప్రక్రియ మొదలైంది : సోనియా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ప్రక్రియ మొదలైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. త్వరలోనే విభజన ప్రక్రియ వేగవంతం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని ప్రకటించారు. విభజనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆంటోని కమిటీకి నివేదికలు ఇవొచ్చని తెలిపారు. మీ అనుమానాలు తీర్చడానికి అవసరమైతే ప్రభుత్వం తరపున మరో కమిటీ వేస్తామని సీమాంధ్ర నేతలతో చెప్పినట్లు సమాచారం.