రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఆకాశ్‌ అనే బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం హయత్‌ నగర్‌ మండలం పెద్దఅంబర్‌పేట వద్ద చోటు చేసుకుంది. విద్యార్థులు సెయింట్‌ మేరీ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన వారు.