తెలంగాణ యువకుడిపై ఆంధ్రా బిల్డర్‌ దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో ఆంధ్రా వాళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ యువకుడిపై ఆంధ్రా బిల్డర్‌ కిషోర్‌ తన సభచరులతో కలిసి దాడి చేశారు. తన వాచ్‌మెన్‌గా పని చేస్తున్న యువకుడు ఆకయ్యను కిషోర్‌ తీవ్రంగా కొట్టాడు. అవమానంతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఆంధ్రా బిల్డర్‌ కిషోరే కారణమంటూ సూసైట్‌నోట్‌లో ఆకయ్య పేర్కొన్నారు. దీంతో నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో కిషోర్‌ లొంగిపోయాడు. బిల్డర్‌ ఇంటి ముందు ఆకయ్య మృతదేహంతో సనత్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దండె విఠల్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.