సోనియా తగాదాలు పెట్టి తమాషా చూస్తుంది : కిషన్‌రెడ్డి
ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తగాదాలు పెట్టి తమాషా చూస్తుందని ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. జగన్ జైల్లో దీక్ష చేయడం ఆస్పత్రికి తరలించడం ఇదంతా నాటకంలా ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ఆటలు ఆడుకుంటుందని ఆయన ఆరోపించారు.