సిరియాపై క్షిపణి దాడి వార్తతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : మంగళవారం రెండు క్షిపణులు ‘మెడిటరేనియస్‌’ ప్రాంతంవైపు వెళ్లినట్లు రష్యన్‌ రాడార్‌ కనిపెట్టింది. అయితే ఆ క్షిపణులు సముద్రంలో పడినట్లు రష్యన్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ క్షిపణులు మధ్యధరా సముద్రం కేంద్రం నుంచి తీరంవైపు సాగినట్లు వార్తాసంస్థ పేర్కొనడంతో క్షిపణి దాడి సిరియా మీద జరిగిందన్న వార్త దావానలంలా వ్యాపించి భారతీయ స్టాక్‌ మార్కెట్లును కుప్పకూల్చింది. బ్యాకింగ్‌, చమురు రంగాల షేర్లు పెనునష్టాల్లో కూరుకుపోయాయి.