మైక్య వాదానికి బలం లేదు.:కోదండరాం


హైదరాబాద్‌ : సమైక్యవాదానికి బలం లేదని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు.టీఎన్జీవో భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సభలకు అనుమతిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారని ,తమ పోరాటం ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా మాత్రమేనన్నారు. అన్ని జిల్లాల్లో ఐకాస నాయకులను ఏకపక్షంగా అరెస్టు చేశారని కోదండరాం ఆరోపి ంచారు.