7న గాండ్ల తిలకేశ్వర వధూవరుల పరిచయ వేదిక

జైపూర్‌, జనంసాక్షి: ఈ నెల 7వ తేదీన మంచిర్యాలలోని వైశ్యాభవన్‌లో గాండ్ల తిలకేశ్వర్‌ వధూవరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు గాండ్ల తిలకేశ్వర తెలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల విజయ్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోనే ప్రథమంగా ఏర్పాటు చేస్తున్న పరిచయ వేదికను జిల్లాలోని గాండ్ల తెలికుల వధూవరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నులిగొండ ప్రకాష్‌, కోశాధికారి గుజ్జేటి బుచ్చయ్య, నాయకులు మిరిమిడి మల్లయ్య, పోతునూరి రవీందర్‌, రాచబత్తుల చంద్రమౌళి, రాసబత్తుల విక్రమ్‌, ఆలేటి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.