70 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధినం

కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 56 బస్తాల గంజాయిని తరలిస్తున్న లారీని కోరుకొండ ఆబ్కారీ శాఖ అధికారులు స్వాథీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.