ఒడిషాలో భూకంపధాటికి 70 మందికి గాయాలు

భువనేశ్వర్: ఒడిషాలో నిన్న సంభవించిన స్వల్ప భూకంపంలో 70 మందికి గాయాలయినట్లు అదనపు కమిషనర్ పీకే మోహపత్ర తెలిపారు. భూమి కంపించిన సమయంలో పరిసర ప్రాంతాల ప్రజలు బహుళ అంతస్థుల భవనాల నుంచి పరుగులు తీయడంతో 70 మందికి పైగా గాయాలయ్యాయని తెలిపారు. ఈ ధాటికి భయాందోళనకు లోనయిన ఇద్దరు వ్యక్తులు భవనాల పైనుంచి దూకారని తెలిపారు. గాయలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని ఆయన వెల్లడించారు.