అంతర్జాతీయ గ్రాండ్‌ మాస్టర్ల టోర్నీ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర చెస్‌ సంఘం నిర్వహిస్తున్న రెండో అంతర్జాతీయ గ్రాండ్‌ మాస్టర్ల చెస్‌ టోర్నీ హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని కోట ్లవిజయభాస్కర రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీ ఆరంభోత్సవానికి ఐఏఎస్‌లుఎల్వీ సుబ్రహ్మణ్యం, లప్‌ అగర్వాల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2100 ఫిడే రేటింగ్‌పాయింట్లు కలిగిన దాదాపు 90 మంది గ్రాండ్‌ మాస్టర్లుఈ టోర్నీలో తలపడుతున్నారు. డిసెంబర్‌ 3వరకు జరిగే ఈ టోర్నీలో మన రాష్ట్రానికి చెందిన ద్రోణవల్లి హారిక కూడా ఆడనుంది. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో ఔత్సాహిక క్రీడాకారులకు మేలు జరుగుతుందని రాష్ట్ర చెస్‌ సంఘం అధికారులు తెలిపారు.