ఐక్యతతో హక్కులు సాధించుకోవాలి: సర్వే
హైదరాబాద్: దళితులు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధంచుకోవాలని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రోరైల్ సౌజన్యంతో కూకట్ పల్లి వై జ&క్షన్‌లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్, ఎంపీ వివేక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దళిత సంఘాలు భారీ ర్యాలీగా వచ్చి ఆయనకు స్వాగతం పలికాయి. దళితులు ఐక్యంగా ఉన్నప్పుడే అంబేద్కర్ ఆశయం సిద్ధించినట్లవుతుందని సర్వే పేర్కొన్నారు. చిన్న రాష్రాలు కావాలన్న అంబేద్కర్ ఆశయాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు ప్రయత్నించడంపై ఎంపీ వివేక్ అభ్యంతరం తెలిపారు.